Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » టర్కీలో నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ పాట

టర్కీలో నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ పాట

  • April 12, 2016 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టర్కీలో నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ల ‘సాహసం శ్వాసగా సాగిపో’ పాట

యువసామ్రాట్‌ నాగచైతన్య, డీసెంట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఏమాయ చేసావె’ చిత్రం ద్వారా సమంతను హీరోయిన్‌గా పరిచయం చేసిన గౌతమ్‌ మీనన్‌ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ద్వారా మంజిమ మోహన్‌ను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను ఇటీవల టర్కీలో 5 రోజులపాటు చిత్రీకరించారు. ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఏప్రిల్‌ చివరి వారంలో ఆడియోను, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ – ”నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ మ్యూజికల్‌గా సెన్సేషనల్‌ హిట్‌ అయింది. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం కూడా ఆడియోపరంగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేసిన ‘ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే…’ అనే పాట 30 లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది” అన్నారు.
యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ – ”ఏమాయ చేశావే చిత్రం నాకు రొమాంటిక్‌ హీరోగా గుర్తింపునిచ్చింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం కూడా ఫస్ట్‌ హాఫ్‌ రొమాంటిక్‌గా వుంటుంది. సెకండాఫ్‌ యాక్షన్‌ కంటెంట్‌తో ప్రేక్షకులందరికీ ఒక స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చేలా రూపొందింది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గౌతమ్‌ మీనన్‌గారి కాంబినేషన్‌లో మరో పొయెటిక్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ‘ఏమాయ చేసావె’ చిత్రానికి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ని అందించిన ఎ.ఆర్‌.రెహమాన్‌గారితో ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి కూడా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి” అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”యూ ట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చిన ‘ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే…’ పాటను ఇటీవల టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో 5 రోజుల పాటు చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్‌ 16 నుంచి 20 వరకు ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ను షూట్‌ జరుగుతుంది. దీంతో టోటల్‌గా చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఏప్రిల్‌ చివరి వారంలో ఆడియో రిలీజ్‌ చేసి, మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ – ”ఏమాయ చేసావె’ చిత్రం తర్వాత నాగచైతన్యతో చేస్తున్న డిఫరెంట్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాగచైతన్య ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రంలో చూస్తారు. రెహమాన్‌గారు ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని చేశారు. మా ముగ్గురి కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.
యువసామ్రాట్‌ నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham Menon
  • #Manjima Mohan
  • #naga chaitanya
  • #Saahasam Swaasaga Saagipo

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

3 hours ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

5 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

6 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

6 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version