Naga Chaitanya: లాల్ సింగ్ చద్దా వెనుక ఇంత కథ ఉందా?

గతేడాది లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నాగచైతన్యకు ఈ ఏడాది విడుదలైన థాంక్యూ సినిమా ఫలితం షాకిచ్చింది. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 5 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తమంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ నెల 11వ తేదీన అమీర్ ఖాన్ హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

లాల్ సింగ్ చద్దా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించకపోతే మాత్రం నాగచైతన్య కెరీర్ కు మైనస్ అవుతుందని చెప్పవచ్చు. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య అరగంట నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

మాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం కూడా చైతన్య కెరీర్ కు ఒకింత మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్ల్ వ్యక్తమవుతున్నాయి. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య నటించిన పాత్ర విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసిన పాత్ర అని సమాచారం అందుతోంది.

సౌత్ ఇండియాలో విజయ్ సేతుపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే డేట్లు సర్దుబాటు చేయలేక మొదట ఈ సినిమాకు ఓకే చెప్పిన విజయ్ సేతుపతి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసిన పాత్ర చైతన్య కెరీర్ కు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు నాగచైతన్యకు క్రేజ్ పెరుగుతోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus