Naga Shaurya, Dulquer Salmaan: ఆ క్రేజీ మల్టీస్టారర్ ఏమైనట్టు.. ఆ వార్తల్లో నిజమెంత..!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టాలీవుడ్లో కన్సిస్టెంట్ గా హిట్స్ కొడుతున్న డబ్బింగ్ హీరో. ఇంకా చెప్పాలంటే మలయాళంలో కంటే.. తెలుగులోనే ఇతనికి ఎక్కువ క్రేజ్ ఉంది. దుల్కర్ నటించిన ‘మహానటి’ (Mahanati) ‘కనులు కనులను దోచాయంటే’ (Kannum Kannum Kollaiyadithaal) ‘సీతా రామం’ (Sita Ramam)  ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వంటి సినిమాలు తెలుగులో చాలా బాగా ఆడాయి. పైగా తెలుగులో దుల్కర్ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. దాదాపు రూ.20 కోట్ల వరకు అతనికి పారితోషికం ఇస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా..

Naga Shaurya, Dulquer Salmaan:

దుల్కర్ తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ (Dasara) నిర్మాతలైన ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ వారికి ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇది ఒక మల్టీస్టారర్ సినిమా. నాగ శౌర్య (Naga Shaurya) కూడా ఇందులో ఒక హీరోగా నటించాల్సి ఉంది. రవి అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

రవి చెప్పిన కథ అటు దుల్కర్ కి, ఇటు నాగ శౌర్యకి బాగా నచ్చింది. రష్మిక (Rashmika Mandanna)  కూడా కీలక పాత్రకి ఎంపికైంది. రమ్య కృష్ణ (Ramya Krishnan), సత్య రాజ్ (Sathyaraj), రావు రమేష్ (Rao Ramesh) వంటి స్టార్స్ కూడా ఇందులో నటించాల్సి ఉంది. కానీ ఎందుకో ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ ఫిలింనగర్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే మరికొంతమంది..

‘దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల లేట్ అవుతుంది తప్ప.. ఆగిపోలేదు’ అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క నాగ శౌర్య (Naga Shaurya) నుండి ‘రంగబలి’ ( Rangabali) తర్వాత మరో సినిమా రాలేదు. అతనివి కూడా రెండు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నట్టు టాక్ నడిచింది.

కాంచన 4.. బుట్టబోమ్మతో లారెన్స్ ఊహించని ప్రయోగం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus