ఆమెతో కలిసిరాను : నాగ శౌర్య

తెలుగు చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా స్వశక్తి తో ఎదుగుతున్న యువ హీరో నాగ శౌర్య. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి చిత్రాలు అతనికి మంచి పేరుని తీసుకొచ్చాయి. అంతే కాదు మెగా డాటర్ కొణిదెల నిహారికతో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా “ఒక మనసు”. వచ్చేనెల రిలీజ్ కానుంది. ఈ చిత్రం తనకు మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఒంటరిగానే పాల్గొంటానని నాగ శౌర్య చెబుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ చానెల్ వాళ్లు అతన్ని షో కి పిలిచినప్పుడు ఈ సంగతి బయట పడిందట. “నేను సింగల్ గా అయితే వస్తాను, హీరోయిన్ తో మాత్రం రాను” అని చెప్పినట్లు సమాచారం.
సినిమా చిత్రీకరణలో ఎంతో సహకరించిన నాగ శౌర్య ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆరాతీస్తే ఈగో ప్రాబ్లమని తెలిసింది. ఈ సినిమా ఆడియో వేడుకలో అతనికి ప్రయారిటీ ఇవ్వలేదని.. సినిమా ప్రమోషన్లో నిర్మాతలు ఆమెకే ప్రాధాన్యం ఇస్తున్నారని కోపంగా ఉన్నాడట. అంతే కాదు పారితోషికంలో కూడా తనకంటే నిహారికకే ఎక్కువ ఇచ్చారని, అది తనకి జరిగిన అవమానంగా భావిస్తున్నాడట.

మెగా డాటర్ కాబట్టి, వెండి తెరపై తొలి చిత్రం కనుక నిహారికకు ప్రయారిటీ ఇవ్వడం సహజం. ఆమె విషయంపై అలగడం మంచిది కాదని, కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి కుప్పిగంతులు వేస్తె అవకాశాలు సన్నగిల్లేందుకు ఆస్కారం ఉందని సినీ పండితులు నాగ శౌర్యను హెచ్చరిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus