నాగఅశ్విన్, శశికిరణ్ ల బాటలో తేజ

ఈమధ్యకాలంలో సెన్సేషనల్ హిట్స్ అందుకొన్న దర్శకులను గమనిస్తే అర్ధమయ్యే విషయం ఒకటే. వాళ్ళందరూ శేఖర్ కమ్ముల శిష్యులన్న విషయం. “మహానటి”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న నాగఅశ్విన్ మరియు రీసెంట్ గా “గూఢచారి”తో సూపర్ హిట్ అందుకొన్న శశికిరణ్ తిక్క ఇద్దరూ శేఖర్ కమ్ముల శిష్యగణమే. తాజాగా ఈ కోవలో చేరానున్నాడు మరో యంగ్ డైరెక్టర్ తేజ. ఈ కుర్రాడు కూడా శేఖర్ కమ్ముల శిష్యుడే. రీసెంట్ గా నాగశౌర్యకి కథ చెప్పగా.. తేజ చెప్పిన పాయింట్ తోపాటు నేరేషన్ కూడా “ఛలో, నర్తనశాల” చిత్రాల తర్వాత తమ బ్యానర్ లోనే ఆ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పుకొన్నాడు కూడా.

‘ఛ‌లో”తో నాగ‌శౌర్య‌లో జోష్ పెరిగింది. చ‌క చ‌క సినిమాలు చేసేస్తున్నాడు. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన “@న‌ర్త‌న‌శాల‌” వ‌చ్చే వారం విడుద‌ల అవుతోంది. భ‌వ్య క్రియేష‌న్స్ రూపొందిస్తున్న “నారీ నారీ న‌డుమ మురారీ” చేతిలో ఉంది. ఇప్పుడు “గ‌ణ‌” అనే మ‌రో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు తేజ న్యూయార్క్ లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో శిక్ష‌ణ పొందాడు. నాలుగు హాలీవుడ్ చిత్రాల‌కూ స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు. ‘ఫిదా’లో కొంత భాగం అమెరికాలో తెర‌కెక్కింది. ఆ స‌మ‌యంలో.. అక్క‌డ శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌ల‌సి ప‌నిచేశాడు. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus