Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

నాగవంశీ ఏం మాట్లాడినా సెన్సిబుల్ గా ఉంటుంది. చాలా మందికి అతని కామెంట్స్ రిలేట్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ అతన్ని ట్రోల్ చేసినా… అతని ఒపీనియన్స్ కరెక్ట్ అని చాలా మంది అతన్ని వెనకేసుకొస్తారు. ఒక రకంగా అతని ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ కరెక్ట్ గానే ఉంటాయి. అతని సినిమాలు కూడా బాగుంటాయి. కానీ ఎందుకో వాటికి దక్కాల్సిన ఆదరణ దక్కదు. ఓటీటీకి వచ్చాక మాత్రం వాటిని తెగ చూస్తుంటారు.

Naga Vamsi

అలాంటివి నాగవంశీని బాగా హర్ట్ చేస్తాయి అనుకుంట..! ఇదిలా ఉంటే.. నాగవంశీ ఇటీవల ఓ బ్లాక్ బస్టర్ సినిమా గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నాగవంశీ మాట్లాడుతూ.. ” ఈ మధ్య సినిమాలు ఎందుకు ఆడట్లేదో.. కొన్ని ఎందుకు ఆడుతున్నాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చూసిన కొన్ని సినిమాలు.. ‘ఏంటి ఇలా ఉంది.. ఇంత పెద్ద హిట్ అయ్యింది.

మనమేమైనా రాంగ్ ట్రాక్ ఉన్నామా. మనం గెయిన్ చేయలేకపోతున్నాం ఏంటి అని నాకే ఓ డౌట్ వచ్చింది. నేను పేరు చెబితే మళ్ళీ హీరో ఫ్యాన్స్ నన్ను తిడతారు. మిగిలిన వాళ్ళు నాకు క్లాస్ పీకుతారు. అవన్నీ నాకు అవసరమా. కానీ ‘అది అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందేంటి. నాకు ఎక్కడం లేదు.. మనమేమైనా జనాలకి అంత దూరంగా ఉన్నామా?’ అని నాకు డౌట్ వచ్చింది” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

కానీ ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటనేది యాంకర్ ఎంత అడిగినా అతను చెప్పలేదు. ఈ క్రమంలో కొంతమంది ‘నాగవంశీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ గురించే ఇలా అంటున్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus