Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi).. నిత్యం ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఓ పక్క వరుసగా సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు నాగవంశీ. ఇటీవల ‘జైలర్ 2’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన ఏకంగా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్టు చాలా మంది చెప్పుకుంటున్నారు.

Naga Vamsi

ఓ డబ్బింగ్ సినిమాపై ఇంత మొత్తం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గతేడాది ‘కూలీ’ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో కూడా నాగవంశీ రేసులోకి వచ్చారు. ఆ సినిమాకి రూ.30 కోట్ల నుండీ రూ.35 కోట్ల వరకు రేటు పలుకుతుంటే.. నాగవంశీ వచ్చి రూ.42 కోట్ల వరకు రేటు చెప్పి హక్కులు తీసుకుంటా అన్నారు. దీంతో మిగిలిన డిస్ట్రిబ్యూటర్లు రూ.42 కోట్ల వరకు వచ్చి ఆగిపోయారు.

కానీ చివరి నిమిషంలో నాగవంశీ ‘కూలీ’ రైట్స్ వద్దని పక్కకి వెళ్ళిపోయారు. ‘వార్ 2’ రైట్స్ తీసుకున్నారు. ‘వార్ 2’ ని తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం రూ.80 కోట్లు పెట్టారు నాగవంశీ. ఆ సినిమా అతనికి భారీ నష్టాలే మిగిల్చింది. నాగవంశీ వల్ల ‘కూలీ’ని ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా రూపాయి మిగల్లేదు సరికదా కొంత మేర నష్టాలు వచ్చాయి. నాగవంశీ రేసులోకి వెళ్లకుండా ఉండుంటే అది తెలుగులో బ్రేక్ ఈవెన్ సినిమా అయ్యుండేది.

సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి.. ఇప్పుడు ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల హక్కులను నాగవంశీ రూ.45 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేసినట్టు అంటే.. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ‘కూలీ’ ని కాదని ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల ధియేట్రికల్ హక్కులను నాగవంశీ తీసుకోవడానికి కారణం ఎన్టీఆర్. అతనితో ‘సితార..’లో ఓ పెద్ద సినిమా చేయాలనేది నాగవంశీ డ్రీమ్. ఇంకో రీజన్ నెల్సన్. ‘జైలర్ 2’ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయాలి. దాని కోసమే నాగవంశీ రూ.45 కోట్లు పెట్టి ‘జైలర్ 2’ హక్కులు దక్కించుకున్నారు. నాగవంశీ స్ట్రాటజీలు అలా ఉంటాయి మరి.

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus