కరోనా సమయంలో చాలా మందికి ట్రీట్మెంట్ అందించానని చెబుతున్నారు నాగబాబు. మెగా ఫ్యామిలీ హీరోలకు చేసిన సాయం చెప్పుకోవడం ఇష్టం ఉండదని.. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందని అన్నారు. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నయ్య ఎంతో మందిని ఆడుకున్నారని.. చేసిన సేవ చెప్పుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని మెగాస్టార్ ను ఉద్దేశిస్తూ అన్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సేవ చేశారని.. జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు. మెగా ఫ్యాన్స్ సేవలుచేస్తున్నారని అన్నారు .
మా పిల్లలు కూడా వారికి తగ్గట్లుగా నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతున్నారని.. అలానే అన్నయ్య గారి కోసం ఉపాసన ఎంతోమందికి సాయం చేసిందని అన్నారు. నిజం చెప్పాలంటే అపోలో ఆసుపత్రి చాలా పెద్ద హాస్పిటల్ అని.. కార్పొరేట్ హాస్పిటల్ గా ఉన్నా.. చాలా తక్కువ మొత్తానికి కరోనా ట్రీట్మెంట్ అందించారని అన్నారు. అదే విషయాన్ని ఉపాసనను అడగగా.. ”ఇలాంటి టైంలోనే కదా.. మనం పది మందికి ఉపయోగపడాలి.. నార్మల్ టైంలో మనం కమర్షియల్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి టైంలో సాయం చేయాలి” అంటూ ఆమె చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని నాగబాబు అన్నారు.
మా అన్నకు తగ్గ కోడలు అనిపించింది ఉపాసన అంటూ ప్రశంసలు కురిపించారు. అన్నయ్య కూడా ఉపాసన ద్వారా ఎన్నో సేవలు చేశారని.. ఆయన అడిగిన వెంటనే ఆమె స్పందించి సేవ చేసిందని చెప్పుకొచ్చింది. సినీ కార్మికులందరికీ అన్నయ్య వ్యాక్సిన్ వేయించారంటే ఉపాసన సాయంతోనే అని చెప్పారు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?