Nagababu: మెగా బ్రదర్స్ ఫోటో షేర్ చేస్తూ నాగబాబు ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

  • November 3, 2023 / 10:58 PM IST

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ లావణ్యల వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం నాగబాబు ఏకంగా 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశారని సమాచారం. తాజాగా నాగబాబు మెగా బ్రదర్స్ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్లిలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఫోటో దిగారు.

నాగబాబు తన పోస్ట్ లో మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు జరిగినా మా బంధం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని నాగబాబు కామెంట్లు చేశారు. మేము చేసిన పనులు మా జ్ఞాపకాలు మాత్రమే కాదని మా మధ్య ఏర్పడిన విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ముఖ్యమైనదని నాగబాబు చెప్పుకొచ్చారు. మా అనుబంధం ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంటుందని నాగబాబు కామెంట్లు చేశారు. మా మధ్య రిలేషన్ నిజంగా బలమైనదని నాగబాబు కామెంట్లు చేశారు.

ఈ బంధం విడదీయలేనిదని నాగబాబు (Nagababu) చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్స్ సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ పోస్ట్ కు లక్షకు పైగా లైక్స్ రావడం గమనార్హం. వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వరుణ్ లావణ్య జీవితాంతం మరింత సంతోషంగా జీవనం సాగించాలని నెటిజన్లు భావిస్తుండటం గమనార్హం.

వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు భారీ స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ జోడీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. వరుణ్ లావణ్య కలిసి నటించాలని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఇతర భాషల్లో కూడా ఈ జోడీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus