మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ సినిమా పరిశ్రమని ఏలుతున్నారు. అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ లేదు అన్న లోటును పూడ్చడానికి నిహారిక కొణిదెల సినిమా పరిశ్రమలోకి జంప్ చేసింది. ఇదిలా ఉంటే ఈ భామ నటించిన తొలి చిత్రం ‘ఒక మనసు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో ఎందరో నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు.
అయితే దొరికిందే అవకాశంగా నిహారిక చేసిన కొన్ని పనులు తండ్రి నాగ బాబుకి కోపం తెప్పించింది. ఇంతకీ విషయం ఏమిటంటే…మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఆఫర్లు వస్తుండటంతో కథ వినకుండానే కొంతమంది దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకుందట నిహారిక దాంతో నాగబాబు కు ఎక్కడా లేని కోపం వచ్చిందట. అంతే కాదు ముందుగా కథ వినకుండా కమిట్ మెంట్ అయితే ఈ మద్య టాప్ హీరోల సినిమాలు సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయని అందుకే కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిహారకు వార్నింగ్ ఇచ్చాడట.
అడ్వాన్స్ లు తీసుకోవలసిన అవసరం లేదని మంచి కథ తో వస్తే తప్పకుండా చేయొచ్చని అంతేకాని కథ లు వినకుండా డబ్బులు తీసుకుంటూ ఓకే చెప్పొద్దని హితువు పలికాడట నాగబాబు. ఏది ఏమైనా…కూతురిని కంట్రోల్ లో పెట్టాలని మన నాగబాబు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. చూద్దాం మరి నిహారిక తొలి చిత్రం ఆమెకు ఎంతటి ఘన విజయాన్ని అందిస్తుందో.