చైతూ, సమంత విషయాల్లో నేను చెప్పిందే జరిగింది – నాగార్జున

అక్కినేని నాగార్జునకి తన కొడుకు నాగచైతన్యతో ఎంత అనుబంధం ఉందో… కోడలు సమంతతో కూడా అంతే అనుబంధం ఉంది. ఇది వరకు అఖిల్, నాగచైతన్య సినిమాల గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు కోడలు చేస్తున్న సినిమా గురించి కూడా పట్టించుకుంటున్నారు. సినిమా ఎలా చిత్రీకరణ జరుపుకుంటుందనే విషయంలోనే కాదు.. సినిమా రిలీజ్ అయిన తర్వాత నటన ఎలా ఉంది? కలక్షన్స్ ఎలా సాధిస్తుందో తెలుసుకుంటున్నారు. వినాయకచవితి సందర్భంగా కొడుకు చైతూ మూవీ శైలజా రెడ్డి అల్లుడు, కోడలు సమంత చేసిన యు టర్న్ మూవీ రిలీజ్ అయ్యాయి. వాటి గురించి లేటెస్ట్ గా నాగ్ స్పందించారు.”భార్యా భర్తల సినిమా ఒకే రోజు విడుదల అవ్వడం నేనెప్పుడూ చూడలేదు. రెండూ బాగా ఆడాయి.

అయితే ఆ రోజు ఉదయం శైలజారెడ్డి అల్లుడు రివ్యూలు చూసి సమంత బాధ పడింది. మరేం ఫర్వాలేదు వసూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్నట్టే శైలజారెడ్డి కి మంచి వసూళ్లు దక్కాయి. యూ టర్న్ రివ్యూలు బాగున్నా వసూళ్లు సరిగా లేవు. ఆదివారం నాటికి వసూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్నట్టుగానే వసూళ్లు పెరిగాయి” అని నాగార్జున చెప్పారు. నాగార్జున హీరోగా నటించిన దేవదాస్ ఈనెల 27 న రిలీజ్ కాబోతోంది. నాని తో కలిసి ఆయన చేసిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో నాగార్జున మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus