నాగార్జున, నాని మల్టీ స్టారర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే ?

అక్కినేని నాగార్జునకు యువ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఇష్టం. ఈగోలను పక్కన పెట్టి తన పాత్రలో లీనమై పోతారు. అలాగే మరో సారి నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ డేట్ ని చిత్ర బృందం ఫిక్స్ చేసింది. వచ్చే నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ప్రస్తుతం నాగార్జున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా నాగ్ నటిస్తున్న ఈ చిత్రానికి శపథం అనే పేరు అనుకుంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 20 నాటికీ కంప్లీట్ అవుతుంది. ఇక నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నారు. ఇందులో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. దీని తర్వాత మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. నాని, నాగ్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus