శ్రీహాన్ కి , శ్రీసత్య ఇద్దరికీ వీకండ్ నాగార్జున ఇచ్చిన క్లారిటీ ఏంటంటే..?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున ఫుల్ ఫైర్ లో కనిపించారు. వస్తూనే సూపర్ స్టార్ కృష్ణగారి మరణానికి సంతాపం తెలుపుతూ హౌస్ మేట్స్ ని పలకరించారు. అంతేకాదు, హౌస్ లో ఈవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్, ఎవిక్షన్ ఫ్రీపాస్ లలో హౌస్ మేట్స్ గేమ్ ఆడిన పద్దతిని చెప్తూ కొంతమందికి క్లాస్ పీకారు. ముఖ్యంగా ఆదిరెడ్డి తాట తీశారు. ఆదిరెడ్డి లాజిక్స్ ని, తను ఆడే విధానాన్ని రాంగ్ అంటూ క్లియర్ గా కళ్లకి కట్టినట్లుగా చెప్పారు. అలాగే, రేవంత్ విషయంలో వేసిన ఎలిగేషన్ ని క్లియర్ గా చూపించారు. మరోవైపు శ్రీహాన్ ని కూడా క్లాస్ పడింది. ఆడియన్స్ అడిగిన ప్రశ్నలో క్లారిటీ ఉందని నీ ఆన్సర్ లోనే ష్యూరిటీ లేదని చెప్పారు.

అంతేకాదు, అప్పుడు ఏం జరిగిందనేది వీడియోతో సహా చూపించారు. అక్కడ శ్రీహాన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు శ్రీసత్య నాకు వంటరాదని చెప్తే వదిలేసి, కీర్తిని మాత్రం నేర్చుకోమని క్లియర్ గా శ్రీహాన్ చెప్పాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాడు. ఆడియన్స్ ప్రశ్నలు అడిగినపుడు నాకు గుర్తులేదంటూ బుకాయించాడు. ఏదో ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించాడు.

కానీ, నాగార్జున ఆ వీడియో చూపించేసరికి శ్రీహాన్ కి నోట మాటరాలేదు. ఇక శ్రీసత్యకి కూడా పంచ్ పగిలింది. నామినేషన్స్ అప్పుడు ఎందుకు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటావ్ అని ప్రశ్నించారు. ఆ ప్రక్రియని సీరియస్ గా తీస్కోవాలి అని, ఇనాయ నామినేషన్స్ అప్పుడు అలా నవ్వుకుంటుంటే అహంకారంగా, వెటకారంగా ఉంటోందని క్లియర్ గా చెప్పాడు నాగార్జున. దీంతో శ్రీసత్యకి ఒక క్లారిటీ వచ్చినట్లుగా అయ్యింది.

రేవంత్ కి కూడా టాస్క్ అయిపోయిన తర్వాత ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నావ్, స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నావంటూ నిలదీశారు. ముఖ్యంగా క్రికెట్ ప్యాడ్స్ కట్టుకుని వికెట్ల మద్యలో రోహిత్ తో కలిసి సెంచరీ రన్స్ తీయలేకపోయాడు రేవంత్. ఈ టాస్క్ తర్వాత బాల్కనీలో కూర్చుని ఇండివెడ్యువల్ గా ఇచ్చి ఉంటే బాగుందేని అన్నాడు. దీన్ని పక్కనే ఉన్న ఆదిరెడ్డి తప్పుబడ్డాడు. ఇండివెడ్యువల్ గా ఇస్తే ఎన్ని రన్స్ తీస్తావ్, ఎవరైనా అంతవరకే పరిగెడతారని బాగా ఆడారని చెప్పాడు. ఈ వీడియోని చూపించి మరీ నాగార్జున రేవంత్ కి క్లాస్ పీకారు.

ఇప్పుడు ఇండివెడ్యువల్ గా ఇస్తే చేస్తావా అని అడిగితే చేస్తానని చెప్పాడు రేవంత్. దీంతో రేవంత్ కి మరోసారి క్లాస్ పడింది. అంతేకాదు, ఆదిరెడ్డికి క్లాస్ పీకీన తర్వాత రేవంత్ తో గేమ్ ఆడిద్దామా అని ఆదిని అడిగారు. దీనికి ఆదిరెడ్డి అసలే రేవంత్ కి బాగోలేదని నెక్ట్స్ వీక్ ఆడిద్దామని చెప్పాడు. ఏది ఏమైనా ఈవీకండ్ మాత్రం నాగార్జున కంటెస్టెంట్స్ గేమ్ ని దుమ్ము దులిపి ఆరేశారంతే. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus