నాగార్జున, నాగ చైతన్య కలయికలో మూడో సినిమాకి అంతా సిద్ధం!

కింగ్ అక్కినేని నాగార్జున తన కొడుకు నాగ చైతన్యతో కలిసి మనం సినిమాలో నటించారు. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత “ప్రేమమ్” లో క్లైమాక్స్‌లో నాగ్ కనిపించారు. అక్కినేని అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇద్దరూ హ్యాట్రిక్ పై గురిపెట్టారు. నాగ్, చైతూ కలిసి మూడో సినిమా చేయబోతున్నారు. నాగార్జునతో కళ్యాణ్ కృష్ణ  “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా చేసి హిట్ అందుకున్నారు. అందులో బంగార్రాజు పాత్ర అందరికీ నచ్చడంతో మరో కథని రాసుకున్నారు. అయితే నాగ్ ఇతర చిత్రాలతో బిజీ కావడంతో చేయడానికి కుదరలేదు. ఈ గ్యాప్ లో కళ్యాణ్ కృష్ణ… నాగచైతన్యతో  “రారండోయ్ వేడుక చూద్దాం” అనే సినిమా తీశారు. ఇదికూడా సూప్ హిట్ అయింది.

తండ్రి కొడుకులకు మంచి సినిమాని ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ.. ఇద్దరికీ కలిపి మరో హిట్ ఇవ్వాలని తపిస్తున్నారు. అయితే ఈ మధ్య అయన రవితేజతో తెరకెక్కించిన నేల టిక్కెట్టు హిట్ కాకపోవడంతో బంగార్రాజు సినిమా ఆగిపోయిందని పుకార్లు షికారు చేశాయి. కానీ అందులో నిజం లేదని.. బంగార్రాజు సినిమా కథని కొన్ని మార్పులు చేసి చైతూకి మంచి పాత్రని ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జున ప్రస్తుతం “దేవదాస్”, “బ్రహ్మాస్త్ర” సినిమాలతో బిజీగా ఉన్నారు.  చైతన్య  సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత “బంగార్రాజు” సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus