Bigg Boss 7 Telugu: పార్టిసిపెంట్స్ వెన్నులో వణుకు పుట్టించిన ఎపిసోడ్ ఇదే..! తేజ కి పనిష్మెంట్ ఎందుకంటే.?

బిగ్ హాస్ హౌస్ షోలో శనివారం ఎపిసోడ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే, అప్పటి వరకూ హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ని హోస్ట్ వచ్చి రోస్ట్ చేస్తుంటే ఆడియన్స్ మస్త్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక 4వ వారం నాగార్జున బెల్టుతో వచ్చి పార్టిసిపెంట్స్ బెండ్ తీశారు. టేస్టీ తేజ అయితే గజ గజా వణికిపోయి అక్కడే బిక్క చచ్చిపోయాడు. స్మైలీ ఫోటో టాస్క్ లో గౌతమ్ ని నిలవరించేటపుడు టేస్టే తేజ కొంచెం ఓవర్ చేశాడు. నడుం బెల్ట్ ని పీకకి వేసి నాలుగు ఐదు సార్లు గౌతమ్ ని బలంగా హిట్ చేశాడు. ఇది చూస్తున్న లేడీ కంటెస్టెంట్స్ వద్దని వారిస్తున్నా ఉన్మాదంతో రెచ్చిపోయాడు. అలాగే, అక్కడ ఉన్న సంచాలక్ సందీప్ కానీ, ఫోటోగ్రాఫర్ గా మారిన శివాజీ కానీ ఏమీ అనలేదు.

ఈ పాయింట్ పై హోస్ట్ నాగార్జున ఫుల్ పైర్ అయ్యారు. సందీప్ ని , శివాజీని ప్రశ్నలతో లాక్ చేశారు. ఇక వాళ్లు చేసింది తప్పని ఒప్పుకున్నారు. అలాగే, టేస్టీ తేజ అయితే పనిష్మెంట్ ఏది ఇచ్చినా తీసుకుంటానని చెప్పాడు. దీంతో జైల్ తో పాటుగా ఇంట్లో పనులు కూడా చేయమని ఆదేశించాడు కింగ్ నాగార్జున.ఆ తర్వాత శుభశ్రీకి శివాజీకి మద్యన జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారు. శివాజీ మీద మీదకి వస్తుంటే శుభశ్రీ ఇబ్బందిగా ఫీల్ అయ్యిందని కంప్లైట్ చేసిన ఇష్యూపై మాట్లాడారు. అందులో ఎలాంటి అసభ్యం లేదని కావాలని శివాజీ చేయలేదని హౌస్ మేట్స్ చెప్పారు. ఒక్క రతిక మాత్రమే శుభశ్రీతో ఏకీభవించింది.

ఇక తర్వాత గౌతమ్ కి ఫుల్ క్లాస్ పడింది. విషయంపై అవగాహన లేకుండా మాట్లాడద్దని, సరిగ్గా గుర్తుంటేనే మాట్లాడమని చెప్పి గౌతమ్ కి క్లాస్ పీకారు. అలాగే, శోభాశెట్టి విషయంలో నువ్వు చేతులతో ఆమె ఫిజిక్ గురించి సైగ చేేశావని, అక్కడ డైలాగ్స్ ఏదైనా ఉండచ్చు కానీ, నీ యాక్షనే ఇంపార్టెంట్ అని చెప్పారు. శుభశ్రీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఫీల్ అయ్యానని చెప్పింది. అంతేకాదు, సందీప్ విషయంలో కూడా క్లారిటీ లేదని గౌతమ్ కి క్లాస్ పడింది.

రతిక – అమర్ పల్లవి ప్రశాంత్ పై చేసిన దాడికి కూడా కింగ్ నాగార్జున సరైన సమాధానం చెప్పారు. రతిక చేసింది తప్పుని క్లాస్ పీకారు. అలాగే, అమర్ కి కూడా ఈవిషయంలో గట్టి క్లాస్ పడింది. ముఖ్యంగా రతిక పల్లవి ప్రశాంత్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా.? సిగ్గుందా అన్న మాటలకి క్లాస్ పీకారు హోస్ట్ నాగార్జున.

దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్ కి కూడా మంచి కిక్ ఇచ్చింది. స్టేజ్ పైకి బెల్టుతో వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ కి తన మాటలతోనే దెబ్బల రుచి చూపించాడు. దీంతో హౌస్ మేట్స్ అందరి ముఖాలు మాడిపోయాయి. లాస్ట్ లో శివాజీ బ్యాటరీ మొత్తం దింపేసి పవర్ అస్త్రాని బ్రేక్ చేసి ఎపిసోడ్ కి కన్ క్లూజన్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus