Bigg Boss 7 Telugu: వీకెండ్ నాగార్జున ఫైర్..! కుండ పగలగొట్టి మరీ క్లాస్ పీకిన హోస్ట్..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ప్రతి శనివారం ఎపిసోడ్ మాత్రం హైలెట్ గా ఉంటుంది. దీనికోసమే బిగ్ బాస్ లవర్స్ అందరూ వైయిట్ చేస్తుంటారు. అయితే, దసరా ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ ప్లానింగ్ లో ఈవారం బిగ్ బాస్ శనివారం ప్రోమోని ముందుగానే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో ట్రెండింగ్ లో నిలిచింది. గతవారం పార్టిసిపెంట్స్ నామినేషన్స్ లో ఎలాగైతే కుండ బద్దలు గొట్టి మరీ నామినేట్ చేశారో, వాళ్లు చేసిన తప్పుని హోస్ట్ గా నాగార్జున స్టేజ్ పైన కుండ పగలకొట్టి మరీ క్లాస్ పీకారు. శోభా పేరుపై వచ్చిన కేక్ ని అమర్ తినేయడాన్ని తప్పుబట్టారు నాగార్జున.

అంతేకాదు, అమర్ ని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు ? గ్రూపిజమా అంటూ సెటైర్ వేశారు. అలాగే, ప్రియాంక భోలే షవాలిని తూ.. అని అనడంపై ఫుల్ క్లాస్ పీకారు. భోలేకి కూడా ఊతపదాలు కొన్ని ఉంటాయ్, కానీ వాటిని బిగ్ బాస్ హౌస్ లో వాడద్దని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ – సందీప్ కి జరిగిన నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఊరోడు అన్నాడని నింద వేశాడు. దీనికి సందీప్ తన డ్యాన్స్ పై ఒట్టేసి మరీ అనలేదని చెప్పాడు. దీనికి పల్లవి ప్రశాంత్ నువ్వు ఎందుకు ఒట్టు వేయలేదని అన్నాడు.

అంతేకాదు, ఇక్కడ ఊరోడు అంటే తప్పేముంది అని, అందరూ ఊరి నుంచీ వచ్చినవాళ్లే కదా అని గట్టిగా చెప్పారు. అంతేకాదు, నేను చాలా గర్వంగా చెప్తాను మా నాన్న ఒక ఊరోడు అని చెప్పి ప్రోమోకి హైప్ ని తీస్కుని వచ్చారు. ఇప్పుడు ఈ డైలాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయ్. ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ వేరే లెవల్లో ఉందని, నిజాన్ని ఇంత నిర్భయంగా ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. అంతేకాదు, అందరినీ సమానంగా చూస్తూ ఫుల్ క్లాస్ పీకుతున్నారని ఎవ్వరికీ కూడా పార్షియాలిటీ అనేది చూపించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు శివాజీ హెల్త్ ఇష్యూష్ కారణంగా హౌస్ ను వదిలి వెళ్లిపోవాల్సి వస్తోంది.

అయితే, ఈ వారం (Bigg Boss 7 Telugu) శివాజీ వెళ్తారా.. లేదా వచ్చే వారం వెళ్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక నామినేషన్స్ లో అశ్విని అందరినీ పోరా.. అని తీసిపారేస్తున్నట్లుగా మాట్లాడటాన్ని కూడా తప్పు బట్టారు నాగార్జున. అలాగే తేజ నువ్వు రెచ్చగొట్టేస్తున్నావని నీ నుంచి ఇది ఆశించలేదని చెప్పారు. భోలే కి అయితే ఎర్రగడ్డ అంటే ఏంటి అని అడిగారు. సెన్స్ లేకపోవడం వేరు, పిచ్చి వేరు అంటూ దానికి దీనికి ఉన్న తేడాని చెప్పాడు కింగ్ నాగార్జున. మొత్తాన్ని కుండ పగలగొట్టి మరీ ఒక రేంజ్ లో హౌస్ మేట్స్ తో ఆడుకున్నాడు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus