Nagarjuna: బంగార్రాజుతో నాగ్ రిస్క్ చేస్తున్నారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని సినిమా రంగానికి చెందిన వాళ్లు భావిస్తారు. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టే అని త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అయితే సంక్రాంతి రేసులో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు మూవీ కూడా ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా నవంబర్ చివరి వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం.

డిసెంబర్ ఎండింగ్ నాటికి బంగార్రాజు ఫస్ట్ కాఫీ సిద్ధమవుతుందని నాగ్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు మరో సినిమాను చూడటానికి ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను తొలగించి థియేటర్లు కేటాయించడానికి థియేటర్ల ఓనర్లు సైతం ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

సంక్రాంతి రిలీజ్ విషయంలో నాగార్జున పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా భారీ సెట్స్ తో, గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus