నాగార్జునతో మరోమారు రొమాన్స్ కి సిద్ధం

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఒక మల్టీస్టారర్ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక హీరోగా నాగార్జున నటించనుండగా, మరో హీరోగా నాని కనిపించనున్నాడు. మాఫియా డాన్ పాత్రను నాగార్జున పోషించనుండగా.. డాక్టర్ పాత్రను నాని చేయనున్నాడు.

ఈ చిత్రంలో నాగార్జున సరసన కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆయన సరసన నాయికగా అనుష్కను తీసుకోనున్నారనేది తాజా సమాచారం. నాగార్జున ‘సూపర్’ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైన అనుష్క, ఆ తరువాత ఆయన సరసన “డాన్, రగడ, ఢమరుకం” చిత్రాల్లో నటించడమే కాక “ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన” చిత్రాల్లో నాగార్జున కోసం ప్రత్యేక పాత్రలు కూడా పోషించింది. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత రిపీటవ్వనున్న ఈ కాంబినేషన్ అనుష్క, నాగార్జున అభిమానులకు పండగే. అయితే.. “భాగమతి” అనంతరం మరో సినిమా అంగీకరించని అనుష్క ఈ విధంగా నాగార్జున సినిమా ఆఫర్ ను ఒకే చేయడం కాస్త చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus