అందుకే నాగార్జునని ఇప్పటికీ ‘మన్మధుడు’ అంటారు

అవును ఆ విషయంలో బాలకృష్ణ కంటే నాగార్జునే చాలా బెటర్ అంట. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా. మాస్ ఫాలోయింగ్ విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణకి క్రేజ్ ఎక్కువే అందులో కాదనలేము. అయితే బాలయ్య ఏ కమర్షియల్ సినిమా తీసినా అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఆ హీరోయిన్లు కూడా యంగ్ హీరోయిన్లో.. లేక బాలీవుడ్ హీరోయిన్లే అయ్యుండాలి. అక్కడితో అయిపోలేదు సినిమాలో హీరోయిన్లు బాలయ్య బాబు నే లవ్ చేయాలి, లవ్ చేస్తున్నాం అంటూ వెంటపడాలి. బాలయ్య హీరోయిన్ వెంట పడే సీన్ ఉంటేనే నా ఫ్యాన్స్ ఫీలైపోతారు అంటూ ఓ సందర్భంలో బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. ఇక వయసుకి సంబందించిన డైలాగులు అస్సలు ఉండకూడదు.

ఇక మన ‘కింగ్’ నాగార్జున దగ్గరికి వద్దాం. ఆరు పదుల వయసు వచ్చినా.. ఇప్పటికీ ఆయన గ్లామర్ చెక్కు చెదరలేదు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాదు ‘శ్రీరామదాసు’ ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా వేసి మెప్పించిన చరిత్ర నాగార్జునది. ఇప్పటికి 30 ఏళ్ళ కుర్రాడిలానే కనిపిస్తుంటారు నాగ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన్మధుడు2’ లో ‘మన్మధుడు’ లో ఎలా కనిపించారో.. అచ్చం అలాగే కనిపించి ఆశ్చర్య పరిచాడు. ఇక ఈ సినిమాలో తన వయసు విషయంలో చాలా సెటైర్లు ఉంటాయి.. ఒకానొక సీన్లో అయితే ‘ముసలాడు’ అనే డైలాగ్ విలన్ వాడాడు. అలాంటి వాటిని కూడా ప్రెస్టీజియస్ గా తీసుకోకుండా.. కథకి ప్రాధాన్యత ఇస్తాడని మరోసారి నిరూపించాడు. ఏమైనా ‘ఆ విషయంలో బాలయ్య కంటే నాగార్జునే బెటర్’ అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ నాగార్జునని ‘మన్మధుడు’ అంటారని కూడా వారు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus