Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సిరి – షణ్ముక్ చేసిన మిస్టేక్ అదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకడం అనేది కామన్. అయితే, ఈసారి మాత్రం సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఫస్ట్ బిగ్ బాస్ ని మైయిన్ గేట్స్ తెరవమని చెప్పి సిరి విషయంలో ఏం జరిగింది అంటూ అడిగాడు. సిరి చాలాసేపు మౌనంగా ఉండిపోయేసరికి, కన్ఫెషన్ రూమ్ కి రమ్మని పిలిచాడు. ఎందుకు నువ్వు అనా హర్ట్ చేస్కున్నావ్ ? ఏం జరుగుతోంది అని ప్రశ్నించాడు.

దీనికి సిరి నేనేంటో నాకు తెలుసు సార్. బయట కూడా ఎలా ఉంటానో తెలుసు కానీ, హౌస్ లో ఎందుకో కనెక్ట్ అయిపోతోంది. ఎందుకో తెలియడం లేదు. ఇది యాక్టింగ్ కాదు సార్, నిజంగానే అలా అవుతోంది అంటూ మాట్లాడింది.ఇక ఇదే విషయంలో షణ్ముక్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. దీప్తి నీకు నిజంగా గుర్తు వస్తుంటే ఇప్పటికిప్పుడే వెళ్లిపో గేట్స్ ఓపెన్ గానే ఉన్నాయ్ అంటూ చెప్పాడు. దీంతో షణ్ముక్ ఇక నుంచీ అలా ఉండనని ప్రామిస్ చేశాడు.

తర్వాత అయోమయంలాగా ఉండకని, టైటిల్ కొట్టేలా నీ గేమ్ ఉండాలని చెప్పాడు నాగార్జున. వీరిద్దరూ లాస్ట్ వీక్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. టాస్క్ జరుగుతున్నా కూడా పక్కకి వెళ్లి మరీ ఎమోషనల్ అయిపోయారు. సిరి అయితే, వాష్ రూమ్ లోకి వెళ్లి తన బాదుకుని మరీ ఏడ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న విషయాల్లో కూడా సీరియస్ గా అలగడం, ఒకరినొకరు నిందించుకోవడం ఫస్ట్ నుంచీ వీళ్లిద్దరికీ అలవాటు అయిపోయింది. ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతూనే ఇండివెడ్యువల్ గా ఆడుతున్నామని చెప్తున్నారు.

అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ కూడా వీళ్లిద్దరి మద్యలో ఉన్న గొడవల్లో ఇన్వాల్ అవ్వరు. ఇక సిరి బాగా ఎమోషనల్ అయ్యేసరికి రవి వచ్చి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదే విషయంలో కింగ్ నాగార్జున ఇద్దరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, మానస్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి పింకీ విషయంలో స్ట్రాంగ్ గా ఉండమని, క్లారిటీగా మాట్లాడమని చెప్పాడు. నువ్వు చెప్పలేకపోతుంటే విషయం చాలా దూరం వెళ్తోందని వీడియో కూడా చూపించి మరీ చెప్పాడు నాగార్జున. మొత్తానికి అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus