Nagavamsi, Jr NTR: ఐరన్ మ్యాన్ గా ఎన్టీఆర్: నాగ వంశీ

ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మాణంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మ్యాడ్. సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నాగ వంశీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అలాగే తన బ్యానర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క సినిమా గురించి నాగవంశీ అప్డేట్స్ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకు సూపర్ హీరోల సినిమాలు అంటే చాలా ఇష్టం మన దగ్గర కూడా అలాంటి ఒక సినిమా చేయాలని చాలా కోరికగా ఉంది అంటూ ఈయన తెలియజేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో తాను ఐరన్ మ్యాన్ సినిమా చేయాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ లో ఒక వెటకారం దాగి ఉంది.

ఆయన ఐరన్ మ్యాన్ పాత్రకు చాలా అద్భుతంగా సెట్ అవుతారని ఎప్పటికైనా తననీ ఐరన్ మాన్ లా చూపించాలనుకుంటున్నానని తెలిపారు. మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఎన్టీఆర్ ను అలా చూపించాలని కోరికగా ఉంది అంటూ తెలిపారు. ఇలా ఎన్టీఆర్ ను ఐరన్ మ్యాన్ లా చూపించాలనే కోరిక ఉంది అంటూ నాగ వంశీ తన మనసులో కోరికను బయటపెట్టారు.

మరి ఈ కోరికను ఎన్టీఆర్ (Jr NTR)  నెరవేరుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus