రెజినా, ప్రగ్యా జైస్వాల్ ఎక్స్ పోజింగ్ ‘నక్షత్రం’కి ప్లస్ అవుతుందా!

  • July 7, 2017 / 07:23 AM IST

టాలీవుడ్ అంటే ఒకప్పుడు సాంప్రదాయ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేది. అయితే అదే క్రమంలో మన టాలీవుడ్ లోను ఐటమ్ సాంగ్స్, రొమ్యాంటిక్ సీన్స్ ఎన్నో వచ్చాయి…కానీ ఎన్నడూ…బాలీవుడ్ రేంజ్ కి దిగజారి మరీ శృంగారాన్ని వండి వార్చ లేదు మన దర్శకులు…అయితే ఇది ఒకప్పటి మాట….ఇప్పుడు మెల్ల మెల్లగా టాలీవుడ్ సైతం బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది…ఈ మద్య బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో శృంగార సన్నివేశాలు కూడా వస్తున్నాయి. లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్స్ , బాత్ రూమ్ సీన్స్, ఇలా చాలానే ఉన్నాయి…ఇదిలా ఉంటే మన టాలీవుడ్ లో శుంగార రసం కాస్త ఎక్కువగా వడ్డించే దర్శకుల్లో మన కృష్ణ వంశీ ఒకడు….హీరోయిన్లను చూపించడంలో ఈయన స్టైలే వేరు అని అంటారు. ముఖ్యంగా  హీరోయిన్ ల అందాలను వెండితెర మీద పరచడం , ఇక హీరో హీరోయిన్ ల మధ్య శృంగార గీతం ఏ రేంజ్ లో పిక్చరైజ్ చేస్తాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత, ఎన్నో ఫ్లపస్ తరువాత చాలా ప్రతిష్టాత్మకంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం నక్షత్రం.

ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్న క్రమంలో….తాజాగా ఇక సాయి ధరమ్ తేజ్ – ప్రగ్యా జైస్వాల్ పై ఓ శృంగార గీతం విషయం సైతం బయటకు రావడంతో ఒక్కసారిగా ఈసినిమాపై అంచానాలు భారీగా పెరిగిపోయాయి….ఇక ఆ శృంగార గీతం ఎలా ఉంది అంటే…కసిగా హత్తుకుంటూ , చర్మం నలిగి పోయేలా , కమిలి పోయేలా ముద్దులు పెట్టుకుంటూ…అబ్బో…మరో పక్క సాయిధరమ్  హీరోయిన్ ఒంటిపై ఎక్కడో చేయి వేసి రెచ్చగొట్టడం చూస్తుంటే నిజంగా ఇది తెలుగు సినిమా..హాలీవుడ్ సినిమా అన్నంతగా ఉందట. ఇక ఇంత మసాలా ఉన్నాక..అందులోనూ మెగా హీరో సినిమా అన్నాకా….మనవాళ్ళు ఎక్కడా తగ్గరు కదా…ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే పక్కా….ఇక సినిమా రిసల్ట్ బట్టి కలెక్షన్స్ డిసైడ్ అవుతాయి అని చెప్పక తప్పదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus