జూన్ 3 న ‘నాకు ఇంకో పేరుంది’..?

సంగీత దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారిన జి‌వి ప్రకాష్ నటిస్తున్న చిత్రం ‘ఎన్నకు ఇన్నోరు పేర్ ఇరుక్కు’ . సామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ సరసన ఆనంది జంటగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 3 న ప్రేక్షకుల తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

జి‌వి ప్రకాషే ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా.. మే రెండో వారం లో చెన్నై లో చిత్ర తమిళ ఆడియోను విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులో ‘నాకు ఇంకో పేరుంది’ గా విడుదల అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus