మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నటిగా వెలుగు వెలిగిన నమ్రత పెళ్లి తర్వాత కుటుంబానికే పరిమితమై పిల్లల భవిష్యత్తు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే హీరో మహేష్ బాబు మాత్రమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్ సూపర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడే చివరి వ్యక్తిని బహుశా నేనే అనుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారని నమ్రత పేర్కొన్నారు. అభిమానులు అన్నివేళలా ఆయనకు మద్దతుగా ఉన్నారని నమ్రత కామెంట్లు చేశారు. మీరు మద్దతు ఇస్తూ మరింత కష్టపడి పని చేసేలా చేశారని ఆమె పేర్కొన్నారు.
గుంటూరులో ఫ్యాన్స్ చూపించిన ప్రేమను చూసి ఒక విషయం గర్వంగా చెప్పాలని ఉందని మహేశ్ ఫ్యాన్స్ కు మీరు ఒక ఎమోషన్ అని నమ్రత కామెంట్లు చేశారు. ఈ ప్రేమను కుటుంబ సభ్యులుగా మనం ఆదరిస్తామని వెల్లడించారు. మహేష్ బాబును ఎంతగానో అభిమానిస్తున్న ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలని మీ అభిమానానికి నా హృదయం సంతోషంగా నిండుగా ఉందని పేర్కొన్నారు.
నమ్రత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మహేశ్, నమ్రత కలిసి ఒక సినిమాలో నటించాలని అభిమానులు ఫీలవుతుండగా ఆ ఆశ నెరవేరే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. నమ్రత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదని భోగట్టా. మహేశ్, నమ్రతలను (Namrata) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!