Balakrishna: బాలయ్య- బోయపాటి..ల 4వ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్లో ఇది గమనించారా?

ఈరోజు నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు.ప్రస్తుతం ఆయన ‘వాల్తేరు వీరయ్య’  (Waltair Veerayya)  ఫేమ్ బాబీ (Bobby)  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఓ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఇంకో గ్లింప్స్ ని విడుదల చేశారు. దీంతో పాటు బాలయ్య నెక్స్ట్ సినిమాకి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చింది.

బోయపాటి శ్రీను (Boyapati Srinu)  దర్శకత్వంలో బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో ఇప్పటికే ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. త్వరలో 4 వ సినిమా కూడా పట్టాలెక్కనుంది. ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో రథచక్రం, రుద్రాక్షలు కనిపించాయి. దీంతో ఇది కచ్చితంగా ‘అఖండ 2’ అయ్యుంటుంది అని అంతా భావిస్తున్నారు.

అయితే ‘అఖండ’ ని ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తే.. ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట (Ram Achanta) , గోపీచంద్ ఆచంట (Gopichand Achanta) నిర్మిస్తున్నారు. అంతేకాదు తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. తేజస్విని ఎవరో అందరికీ తెలుసు కదా.. బాలయ్య చిన్న కూతురు. కొన్నాళ్లుగా బాలకృష్ణ ప్రాజెక్టుల విషయంలో ఈమె కీలక పాత్ర వహిస్తుంది.

చిన్న కూతురు అంటే బాలయ్యకి చాలా ఇష్టం. అంతేకాదు ఆమె ఓ మాట చెబితే బాలయ్య తూచా తప్పకుండా పాటిస్తాడట బాలయ్య. మొత్తానికి బోయపాటి- బాలయ్య..ల 4వ సినిమాతో ఈమె నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది అని స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus