Mokshagnya: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • September 10, 2024 / 04:37 PM IST

నందమూరి మోక్షజ్ఞకు (Mokshagnya) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా తొలి సినిమాతోనే మోక్షజ్ఞ ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri)  నిర్మాత కాగా నందమూరి తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. తొలి సినిమాకే 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకోవడం సాధారణ విషయం కాదని మోక్షజ్ఞకు మాత్రమే ఈ ఘనత సొంతమైందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Mokshagnya

మోక్షజ్ఞ (Mokshagnya) డ్యాన్స్ కూడా బాగా చేయగలడని డైలాగ్స్ కూడా అద్భుతంగా చెప్పగలడని తెలుస్తోంది. కనురెప్పలు ఎగరేస్తూ మోక్షజ్ఞ డైలాగ్స్ చెబుతారని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం భారీ స్థాయిలో పెరుగుతోంది. తన గురించి సినీ ప్రముఖులు చేసిన ప్రతి ట్వీట్ కు రియాక్ట్ కావడం ద్వారా మోక్షజ్ఞ పాజిటివ్ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. తారక్ (Jr NTR)  , కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సైతం మోక్షజ్ఞ సక్సెస్ సాధించడం కోసం తమ వంతు సపోర్ట్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో మోక్షజ్ఞ (Mokshagnya) ఇమేజ్ పెరిగేలా ఈ హీరోలు అండగా నిలబడుతున్నారు. దేవర (Devara) ప్రమోషన్స్ లో భాగంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తారక్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. మోక్షజ్ఞ అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంచుకుంటే మాత్రమే కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మోక్షజ్ఞ ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుండగా ఫస్ట్ మూవీ సక్సెస్ సాధిస్తే మోక్షజ్ఞతో సినిమాలను తెరకెక్కించడానికి స్టార్ డైరెక్టర్లు,

ఇతర భాషల డైరెక్టర్లు ఆసక్తి చూపే ఛాన్స్ అయితే ఉంటుంది. మోక్షజ్ఞ మీడియా ముందుకు వస్తే ప్రేక్షకుల ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికే ఛాన్స్ ఉంది. మోక్షజ్ఞ తొలి సినిమా నందమూరి ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని తెలుస్తోంది.

‘సరిపోదా శనివారం’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus