మళ్ళీ మల్లూ భామ కావాలంటున్న నాని

మొన్నటి వరకు కోలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ చాలా ఉండేది. ప్రస్తుతం కూడా ఉందనుకోండి. అయితే తెలుగులో కూడా ఎన్నడు లేని విధంగా కొంత మంది కొత్త భామలు సీనియర్ హీరోయిన్స్ ని తెగ డామినేట్ చేస్తున్నారు. మన కుర్ర హీరోలు కూడా ఈ మధ్య చేసిన హీరోయిన్స్ తో అస్సలు చేయడం లేదు. కొత్త భామలతో స్క్రీన్ పై కనిపించాలని చాలా ఉత్సహం చూపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. నాని ఇటీవల కిషోర్ తీరుమలతో ఓ కథను ఒకే చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో నాని మళ్లీ మల్లు బ్యూటీనే తీసుకోవాలని దర్శకులతో చర్చలు జరుపుతున్నాడట. ఇంతకుముందు నాని నిత్యామీనన్, నివేత థామస్, అను ఇమ్మాన్యుయేల్ ని టాలీవుడ్ కి పరిచయం చేయించిన సంగతి తెలిసిందే. ఆ కేరళ బ్యూటీలకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కుతోంది. దీంతో న్యాచురల్ స్టార్ మరోసారి కూడా అక్కడి నుంచే ఒక మంచి అమ్మాయిని పరిచయం చేయాలని చూస్తున్నాడట.
కిషోర్ తీరుమల కూడా మల్లు గర్ల్ కీర్తిని నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా మరో మల్లు గర్ల్ పై కన్నేసినట్లు సమాచారం. ఓ ఇద్దరు లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తారట. ఇక సినిమాకు “చిత్రలహరి” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో సినిమాను ఎలాగైనా స్టార్ట్ చేయాలని ప్లాన్స్ వేస్తున్నట్లు టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus