నాని, శర్వానంద్ ల క్రేజ్ మామూలుగా లేదుగా!

ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ.. నేటి పోటీని తట్టుకొని హీరోలుగా నాని, శర్వానంద్ నిలబడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోలో జాబితాలో నిలిచారు. వరుసగా విజయాలను అందుకుంటున్న నాని ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలో పూర్తికానుంది. ఈ చిత్రం తర్వాత  యువ దర్శకుడు మేర్లపాక గాంధీ  21 వ ప్రాజక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి “కృష్ణార్జున యుద్ధం” అని పేరు కూడా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత హను రాఘవపుడి, కిశోర్ తిరుమలతో సినిమాలు చేయనున్నారు. శర్వానంద్ కూడా సీనియర్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి లతో తలపడ్డారు.

శతమానం భవతి చిత్రంతో విజయం అందుకున్నారు. దీని తర్వాత చేసిన  “రాధ”  నిరాశపరిచినప్పటికీ మహానుభావుడితో హిట్ కొట్టారు. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. దీని తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ తో ఓ మూవీ అనుకుంటున్నారు. ఇలా నాని, శర్వానంద్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. వీరు ఈ క్రేజ్ ని ఎంతవరకు నిలుపుకుంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus