నిత్యామీనన్ “ప్రాణ” లో కనిపించనున్న నాని!

“అలా మొదలయింది..” ఈ చిత్రం నాని, నిత్యామీనన్ సినీ కెరీర్ ని మలుపుతిప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వారిద్దరి మధ్య స్నేహం ఇప్పటికి చెక్కుచదరకుండా ఉంది. నాని నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా “అ!” లోను నిత్యామీనన్ కీలకరోల్ చేశారు. ఈ ప్రయోగాత్మక చిత్రంలో నాని కూడా చేపగా కనిపించారు. ఇప్పుడు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో “ప్రాణ” అనే మూవీ తెరకెక్కుతోంది. ప్రధాన పాత్ర అనడం కంటే ఒకే ఒక్క పాత్రతో రూపుదిద్దుకుంటోందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నాని విడుదల చేశారు.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడదల చేయనున్నారు.

ఈ ప్రయోగాత్మక సినిమాకి ప్రముఖ టెక్నీషియన్లు  పని చేస్తున్నారు. వీకే ప్రకాశ్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గా పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పుకుట్టీ  సౌండ్ డిజైన్ చేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్  సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఎస్ రాజ్ ప్రొడక్షన్స్, రియల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాను కూడా భాగస్వామిని అని నాని చెప్పారు. అది చిన్న పార్ట్ మాత్రమే అని వెల్లడించారు. సినిమాలో కనిపిస్తారా? లేకుంటే వినిపిస్తారా? పోనీ నిర్మాణంలో భాగస్యాములు అవుతారా? అనేది .. నాని స్పష్టం చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus