నేచురల్ స్టార్ నాని (Nani) ఇటీవలి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ‘దసరా’ (Dasara , ‘హాయ్ నాన్న’ (Hi Nanna) , సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం శైలేష్ కొలనుతో (Sailesh Kolanu) కలిసి ‘హిట్ 3’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నాని సొంత బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇదే సమయంలో నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం, భారీ కోట్ల 70 బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్ వస్తోంది.
ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘హిట్ 3’ తర్వాత, శ్రీకాంత్ ఒదేల (Srikanth Odela) దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం 2024 ప్రారంభంలో ప్రారంభం కానుందని టాక్. ఇదిలా ఉంటే, ‘హిట్ 3’ తర్వాత నాని శేఖర్ కమ్ములతో (Sekhar Kammula) ఓ సినిమా చేయబోతున్నారని కూడా బజ్ ఉంది. ఇలా నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, కొత్త ప్రొడ్యూసర్లను కూడా ఆకర్షిస్తున్నాడు. నాని వరుస విజయాలతో తన మార్కెట్ స్థాయి మల్టీపుల్ అయింది.
ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఆయన సినిమాలు మంచి బిజినెస్ సాధిస్తున్నాయి. ఇక ఓటీటీ ఛానెల్స్ కూడా నాని సినిమాల హక్కులు మంచి ధరలకు తీసుకుంటున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో, నాని తన రెమ్యూనరేషన్‌ను కూడా రీసెంట్‌గా పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. ‘హిట్ 3’ తర్వాత చేయబోయే సినిమాలకు 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనితో, నాని ప్రస్తుతం టైర్ టూ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ గా నిలిచారు.
చూస్తుంటే రాబోయే సినిమాలతో టైర్ 1 లిస్టులోకి జంప్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. హిట్ 3 సినిమాతో నాని మరింత హైప్‌ని సొంతం చేసుకుంటే, ఆయన మరింత భారీ బడ్జెట్ చిత్రాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా నాని చిత్రాల కోసం 100-150 కోట్ల బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదని తెలుస్తోంది. హిట్ 3 సక్సెస్ అయితే నాని టైర్ వన్ హీరోల జాబితాలో చేరిపోవడమే కాకుండా, ఆయన రెమ్యూనరేషన్ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.