నానిని అందరూ పక్కింటి కుర్రాడు, ఇంట్లో మనిషి అంటుంటారు. నాని కూడా చాలాసార్లు తనను అందరూ బాయ్ నెక్స్ట్ డోర్‌లా చూస్తుంటారు అని మురిసిపోతుంటాడు. అయితే అలాంటి నాని ఇంటింటికి తన సినిమాను తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో ఓ నాని సినిమా ఓటీటీకి వచ్చి దారుణగా బోల్తా కొట్టింది. దీంతో ఓటీటీ అంటే నాని ‘నో’ అంటున్నాడట. కరోనా తొలి వేవ్ సమయంలో నాని ‘వి’ సినిమా విడుదలకు సిద్ధమైంది.
అయితే పరిస్థితులు చక్కబడటానికి సమయం పట్టేలా ఉండటంతో ఓటీటీలో విడుదల చేసేశారు. నాని డేరింగ్‌ను చూసి అందరూ మెచ్చుకున్నారు. అయితే ఫలితం మాత్రం యాంటీగా వచ్చింది. సినిమాకు దారుణమైన రివ్యూస్ రాగా, స్పందన తక్కువగా వచ్చింది. 25వ సినిమా వచ్చిన ఆ చిత్రం అలా అవ్వడంతో నాని చాలా నిరాశపడ్డాడట. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చేసరికి… నాని సేమ్ సిట్యువేషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమా సిద్ధంగా ఉంది.
దీంతో సినిమాను ఓటీటీకి ట్రై చేద్దామని నిర్మాతలు అనుకున్నారట. కానీ నాని ససేమిరా అంటున్నాడట. దీంతో నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గిందట. అంతేకాదు తన సినిమాలేవీ ఓటీటీకి ఇచ్చే ఉద్దేశం లేదని నాని సన్నిహితుల దగ్గర అన్నాడని సమాచారం. ‘వి’ ఫలితం నానిని బాగా భయపెట్టినట్లుందే.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్