Nani: హర్రర్ సినిమాల గురించి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పిరికోళ్ళని తీసుకుని వెళ్ళండి అంటూ..!

హర్రర్ సినిమాలు థియేటర్లలోనే చూడాలి అని చాలా మంది అంటుంటారు. ఆ ఫీల్ ఇంట్లో కూర్చుని చూస్తే రాదు అని అంటారు. అది ఎందుకో నాని వివరించాడు. నిన్న ‘శబ్దం’ (Sabdham) ఈవెంట్ కి నాని (Nani) గెస్ట్ గా వచ్చాడు. నాని, ఆది (Aadhi Pinisetty) కాంబినేషన్లో గతంలో ‘నిన్ను కోరి’ (Ninnu Kori) సినిమా వచ్చింది. అది మంచి విజయం సాధించింది. నాని మాట్లాడుతూ..” ఆది.. నాకు ‘నిన్ను కోరి’ టైం నుండి ఫ్రెండ్. ఆ తర్వాత చాలా క్లోజ్ అయిపోయాడు. నిక్కీ, ఆది ఇద్దరూ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు అని చెప్పాలి.

Nani

అతనికి చాలా మొహమాటం. ఎప్పుడో కాని ఏమీ అడగడు. అలాంటిది తన ‘శబ్దం’ సినిమా గురించి ఎక్కువగా చెప్పాడు. ఈరోజు ఈవెంట్ ఉంది రావాలి అన్నాడు. ఈరోజే నా ‘కోర్ట్’ (Court)  ఈవెంట్ కూడా ఉంది. అయినప్పటికీ దాన్ని ముందుకు పుష్ చేసి.. ఈ ఈవెంట్ కి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. ‘శబ్దం’ సినిమా నేను చూసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందాను. సాధారణంగా నాకు కథాబలం ఉన్న హర్రర్ సినిమాలు అంటేనే ఎక్కువ ఇష్టం.

‘ది కంజురింగ్’ ని నేను బాగా ఇష్టపడతాను. మళ్ళీ నాకు ఆ రేంజ్లో ‘శబ్దం’ నచ్చింది. ఫిబ్రవరి 28న మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని తీసుకుని ‘శబ్దం’ థియేటర్స్ కి రండి. హర్రర్ సినిమాలను థియేటర్లలోనే చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది అరుస్తుంటారు. నిజానికి వాళ్ళు భయమేసి అరుస్తారు. ఆ ఫీల్ బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్న పిరికోళ్ళని తీసుకుని మరీ ‘శబ్దం’ కి వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.

 ‘శబ్దం’… ‘వైశాలి’ కి సీక్వెలా? మెయిన్ పాయింట్ రివీల్ చేసేశారుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus