సందీప్ కిషన్ (Sundeep Kishan) అందరికీ సుపరిచితమే. టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఇతను కూడా ఒకరు. అంతేకాదు సరైన టాలెంట్ ను గుర్తించడంలో కూడా ఇతను సిద్ధహస్తుడు. ఇతని లేటెస్ట్ మూవీ ‘మజాకా’ (Mazaka) రిలీజ్ కి రెడీగా ఉంది. ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దీనికి దర్శకుడు. దీని ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.అదేంటంటే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నాడట.
సందీప్ కిషన్ మాట్లాడుతూ… ” నేను కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. నాకు సైనస్ సమస్య ఉంది. నేను నిద్రపోయి లేచిన తర్వాత నా ముక్కు వెనుక భాగం కొంచెం బ్లాక్ అవుతుంది. అందువల్ల వెంటనే నేను ఫ్రీగా మాట్లాడలేను. ఉదయాన్నే లేచిన తర్వాత నేను అమ్మ, నాన్న..లతో కూడా వెంటనే మాట్లాడాను. కొంచెం యోగా వంటివి చేసుకుని.. తర్వాత గ్రీన్ టీ వంటివి తీసుకుని.. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడతాను.
మ్యూజిక్ వంటివి ఈ వ్యాధి అనే ఆందోళన నుండి నాకు రిలీఫ్ ఇస్తుంటాయి. దీనికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది అని డాక్టర్లు తెలిపారు. కానీ ఇప్పుడు అది చేయించుకుంటే.. నా ముఖంలో మార్పులు వస్తాయి. దీంతో సినిమాలకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం వేస్తుంది. నిజంగానే సర్జరీ చేయించుకున్నాక నెల రోజుల పాటు షూటింగులకు గ్యాప్ ఇవ్వాలి. అందుకే అప్పుడే సర్జరీ జోలికి పోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.