నవ్వించే “మజ్ను” టీజర్

నేచురల్ స్టార్ నాని రూటే వేరు. విభిన్నమైన కథలను ఎంచుకొని దానికి కామెడీ కోటింగ్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. పక్కింటి కుర్రోడి పాత్రలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మాన్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ హీరో మజ్ను గా మరో మారు నవ్వించడానికి సిద్దమయి పోయాడు. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఈ చిత్ర పోస్టర్ లో “మందు తాగడం మాని… ప్రేమించడం మొదలు పెట్టండి” అంటూ సూచన నేటి యువతకు ఆకట్టుకుంది.

ఇది ప్రేమ మిళితమైన పక్కా కామెడీ మూవీ అని డైరక్టర్  విరంచి వర్మ చెప్పకనే చెప్పాడు. శుక్రవారం విడుదలైన టీజర్ లో ఏకంగా చూపించాడు. ఇళయరాజా స్వరపరిచిన  “ప్రేమ లేదని.. ప్రేమించ రాదనీ” పాట వింటున్న నాని పరిస్థితిని చూస్తే ప్రేమలో ఫెయిల్ అయిన కుర్రోడి బాధ కనిపిస్తుంది. నాని నటన చూస్తే మాత్రం నవ్వు వస్తుంది. మరో వైపు చిత్రంలో నటించిన కొత్త హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ను గ్లామర్ గా చూపించి టీజర్ ఆకట్టుకునేలా చేయడంలో మజ్ను బృందం సక్సస్ అయింది.

ఈ టీజర్ లో నాని నడిపిన రథం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడు నడిపే రథం మాదిరిగా ఉండడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నఈ మూవీకి, గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus