నాని టైటిల్ మారింది!
- April 15, 2016 / 01:46 PM ISTByFilmy Focus
‘అష్టా చమ్మా’ తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మొన్నటివరకు ఈ సినిమాకు ‘ఎవడితడు’ అనే టైటిల్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘జెంటిల్‌మన్’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లుగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్ కు గురి చేసే అంశాలుంటాయి. ఆహ్లాదకరమైన రొమాన్స్, సెంటిమెంట్, వినోదం తగిన మోతాదులో కలగలిసి ఉంటాయని చెప్పారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












