Nani: ఈగ సీక్వెల్ గురించి నాని అడిగితే జక్కన్న అలా అన్నారా?

  • August 27, 2024 / 03:00 PM IST

నాచురల్ స్టార్ నాని (Nani) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో నాని ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా అదరగొడుతుండగా నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. ఎస్జే సూర్య (SJ Suryah) విలన్ గా నటిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

Nani

అయితే నాని సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈగ ఒకటి కాగా రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. బడ్జెట్ తో పోల్చి చూస్తే భారీ మొత్తంలో కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. అయితే ఈగ (Eega) సీక్వెల్ గురించి నానికి ప్రశ్నలు ఎదురు కాగా నాని చెప్పిన జవాబు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నేను విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) సార్ ను ఈగ సీక్వెల్ గురించి ఎప్పుడూ అడగలేదని కానీ రాజమౌళితో మాత్రం సరదాగా చర్చించానని నాని అన్నారు. ఈగ2 ఎప్పుడని రాజమౌళిని అడిగితే మేము ఈగ సీక్వెల్ చేసినా నీతో అవసరం లేదని ఈగ ఉంటే చాలని అదే సీక్వెల్ లో తిరిగొస్తుందని చెప్పారని నాని పేర్కొన్నారు. మరి ఈగ సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

రాజమౌళి ప్రస్తుత పరిస్థితుల్లో ఈగ సీక్వెల్ ను తెరకెక్కించడం సులువైన విషయం అయితే కాదు. మహేష్ (Mahesh Babu)   సినిమాను రాజమౌళి పూర్తి చేయడానికే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావడం లేదు. జక్కన్న సైతం తర్వాత సినిమాల విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.

 ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus