స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) సతీమణి తబిత సమర్పణలో విడుదల చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా విచ్చేయడం వంటి వాటి వల్ల సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇక ఆగస్టు 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది.
ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. నిన్న కూడా ఓకే అనిపించాయి కలెక్షన్స్. ఒకసారి (Maruthi Nagar Subramanyam Collections) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.39 cr |
సీడెడ్ | 0.11 cr |
ఆంధ్ర(టోటల్) | 0.31 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.12 cr |
ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.05 cr |
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రానికి రూ.2.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2.8 కోట్లు వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.05 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.