నాచురల్ స్టార్ నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలకు హాజరవడం చేస్తున్నారు. ఇలా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈయన తాజాగా ఒక ఆంగ్ల మీడియా పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నానికి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొంటారా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ ఈ షోకి నన్ను పిలిచిన కూడా నేను రాను అని వారికి చాలా గౌరవంగా సమాధానం చెబుతానని తెలియజేశారు.
ఈ షో కి హాజరు కమ్మంటే నేను రాను కానీ కరణ్ గారితో కలిసి ఈ సినిమా గురించి కాసేపు మాట్లాడమంటే మాట్లాడతానని, ఇలాంటి టాక్ షోలకు మనలాంటివారు పెద్దగా సెట్ అవ్వరు అంటూ సందర్భంగా నాని చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ టాక్ షోకి ఎంతో మంచి ఆదరణ ఉనప్పటికీ బయట మాత్రం ఈ కార్యక్రమం పట్ల పూర్తిస్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది అనే సంగతి కూడా తెలిసింది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే సెలబ్రిటీలను కరణ్ చాలా టిపికల్ బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు కొంతమంది సెలబ్రిటీలు ఫేస్ చేయలేక ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇష్టపడరు. ఇందులో భాగంగానే నాని (Nani) కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానని చెప్పారని పలువురు భావిస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!