ఎవడో ఒకడు నాని కాదట..!

నాని కెరీర్ భూమ్మీది మోటారు వాహనాల కంటే, ఖగోళంలోని గ్రహలకంటే వేగంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు బాక్సాఫీస్ వద్ద విజయ పతాకం ఎగురవేసిన నాని వచ్చే నెలలో మరో సినిమాని తెరమీదికి తీసుకొచ్చే కసరత్తులు చేస్తున్నాడు. దీంతోపాటు తర్వాతి సినిమాల ప్రణాళికలను సిద్ధం చేస్తూ కాలంతో పోటీ పడుతున్నాడు. ఆ క్రమంలోనే వేణు శ్రీరామ్ తోనూ ఓ సినిమా చేయనున్నాడు ఈ నేచురల్ స్టార్.

‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో మెగాఫోన్ పట్టిన వేణు శ్రీరామ్ రెండో సినిమాగా రవితేజతో ఓ సినిమా మొదలెట్టాడు. ‘ఎవడో ఒకడు’ పేరుతో దిల్ రాజు నిర్మాతగా పూజా కార్యక్రమాల వరకూ వెళ్లిన ఈ సినిమా అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు నానితో వేణు శ్రీరామ్ సినిమా అనేసరికి ఆ కథతోనే కానిచ్చేస్తున్నారని ప్రచారం జరిగింది. విషయం దర్శకుడి వరకూ చేరడంతో ఆ కథకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదనీ, నాని కోసం రాస్తున్నది కొత్త కథని సన్నిహితుల ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నాని శైలి హాస్యం, కుటుంబ బంధాలతో ఈ సినిమా ఉండబోతుందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది సినిమా. ‘ఎవడో ఒకడు’లో హీరో లెక్చరర్ గనక కాస్త పెద్ద హీరో అయితే బావుంటుంది. అప్పట్లో నాగార్జున పేరు ప్రస్తావనకొచ్చిందీ అందుకే మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus