మన టాలీవుడ్ ప్రేక్షక దేవుళ్ళు మిగిలిన పరిశ్రమల వారితో పోలిస్తే కాస్త డిఫరెంట్ ఎందుకంటే కొత్తదనాన్ని ఇష్టపడుతూ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ ఉండే వాళ్ళే సహజత్వాన్ని పెద్దగా ఇష్టపడరు…ఇంతకీ ఈ కధ అంతా ఎందుకు అంటే మన టాలీవుడ్ సినిమా కధనే సినిమాగా తీసి ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చాయి. అందులో ముఖ్యంగా రవితేజ నటించిన నేనింతే, నాగ చైతన్య నటించిన ఏం మాయా చేశావే ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ రెండు సినిమాల్లో రవితేజ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోగా, చైతు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది. దానికి కారణం ఏంటి అంటే…నేనింతే సినిమా అంతా సినిమా కధ చుట్టూనే తిరుగుతుంది, కానీ చైతు సినిమాలో లవ్ స్టోరీతో పాటు అక్కడక్కడా సినిమా కధ కనిపిస్తుంది. అదే క్రమంలో రవితేజ నటించిన ఖడ్గం సినిమానె తీసుకుంటే అదికూడా భారీ హిట్ అయ్యింది దానికి కారణం ఏంటంటే…ఆ సినిమా అంతా దేశభక్తి అండ్ టెర్రరిజమ్ మీద సాగుతూనే…మరో పక్క రవితేజ పాత్ర మాత్రం సినిమా ఫీల్డు చుట్టూ తిరిగుతున్నట్లుగా కొన్ని సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించడమే. ఇదిలా ఉంటే తాజాగా నాని నటించబోతున్న విరించి వర్మ సినిమా సైతం సినిమా కధ చుట్టూనే తిరుగుతుంది అని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నేనింతే, ఒక విచిత్రం సినిమాలులాగా కాకుండా కధతో పాటు సినిమా కధను కలిపి, ఖడ్గం, ఏం మాయా చేశావే లాంటి సినిమాలుగా ఉండాలి అని నాని అభిమానులు ఆశపడుతున్నారు. మరి దీని గురించి నని ఏమంటాడో చూడాలి.