మంచి సినిమానే.. కానీ..?

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను జారీ చేసారు. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇదని హీరో నాని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు కూడా పాజిటివ్ రిపోర్ట్ ను ఇవ్వడం విశేషం.

నాని ఈ చిత్రంలో క్రికెటర్ ‘అర్జున్’ గా కనిపించబోతున్నాడు. ప్రేమ .. కుటుంబం .. బంధాలు .. పరిస్థితులు .. ఆశయం .. ఇలా బలమైన ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు గౌతమ్. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగుతుందట. ‘మళ్ళీరావా’ లానే మంచి డైలాగులతో.. దానికి తోడైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుందట. ఓ పక్క ఇప్పటి పరిస్థితిని చూపిస్తూనే.. ఫ్లాష్ ఎపిసోడ్ కు సంబందించిన సీన్లు వస్తుంటాయట. ఇంటర్వెల్ కి సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందట. ఇక సెకండ్ హాఫ్ లో మొదట పర్వాలేదనిపించినా.. మధ్యలో కాస్త విసిగిస్తుందట. సినిమా మొత్తంలో నాని నటనే హైలెట్ గా ఉంటుందట. ప్రేమికుడిగా, తండ్రిగా, క్రికెటర్ గా.. నాని ‘వన్ మ్యాన్ షో’ చేసేసాడట. ఇక హీరోయిన్ శ్రద్దా నటన కూడా ఆకట్టుకుంటుందట. కానీ మిక్సిడ్ స్క్రీన్ ప్లే కొంత మైనస్ అని చెబుతున్నారు.అయితే క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉండడంతో పాటూ కంటతడి కూడా పెట్టిస్తుందట. ఓవరాల్ గా ‘జెర్సీ’ ఓ మంచి చిత్రమని.. ప్రశంసలు కురిపించారు సెన్సార్ సభ్యులు. మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus