Saripodhaa Sanivaaram: బుకింగ్స్ లో అదరగొడుతున్న నాని.. భారీ హిట్ దక్కనుందా?
- August 25, 2024 / 06:00 PM ISTByFilmy Focus
నాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమా ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను అందుకోలేదు. అయితే వివేక్ ఆత్రేయ టాలెంట్ ను నమ్మి నాని మరో ఛాన్స్ ఇవ్వగా ఈ కాంబినేషన్ లో సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) టైటిల్ తో తెరకెక్కిన మూవీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
Saripodhaa Sanivaaram

తాజాగా ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఈ సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ బుకింగ్స్ గురించి వెల్లడిస్తూ ది డోర్స్ ఓపెన్ అంటూ నాని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్, ఎఎఎ సినిమాస్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్, సుదర్శన్ 35 ఎం.ఎంలలో సరిపోదా శనివారం బుకింగ్స్ పరంగా అదరగొడుతోంది.

సినిమా రిలీజ్ కు 4 రోజుల సమయం ఉండటంతో ఆ సమయానికి ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగష్టు నెలలో విడుదలైన సినిమాలలో చిన్న సినిమాలు ఎక్కువగా హిట్ గా నిలవగా సరిపోదా శనివారం ఈ నెలలో హిట్టైన పెద్ద సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సరిపోదా శనివారం మూవీ బుకింగ్స్ అదరగొడుతుండటంతో ఈ సినిమాకు భారీ హిట్ దక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరిపోదా శనివారం బిజినెస్ పరంగా కూడా అదరగొట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయని సమాచారం అందుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ కు (Priyanka Mohan) సైతం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో సక్సెస్ సాధించిన నాని ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
















