Kiran Abbavaram, Rahasya Gorak: రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?
- August 23, 2024 / 08:42 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు కాగా త్వరలో క సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) రహస్య గోరక్ ల (Rahasya Gorak) వివాహం గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) సినిమాతో కిరణ్ అబ్బవరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Kiran Abbavaram, Rahasya Gorak

ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కిరణ్ అబ్బవరం, రహస్య మధ్య ప్రేమ మొదలై ఆ ప్రేమ పెళ్లిగా మారింది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జోడీ గురించి రూమర్లు వినిపించినా ఈ జోడీ మాత్రం వాటి గురించి రియాక్ట్ కావడానికి పెద్దగా ఇష్టపడలేదు. అయితే కొన్నిరోజుల క్రితం కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లికి సంబంధించిన తీపికబురు చెప్పారు.

అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగగా కర్ణాటక కూర్గ్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఈ పెళ్లి జరిగినట్టు సమాచారం అందుతోంది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేశారని భోగట్టా. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం క సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. గత మూడు రోజులుగా కిరణ్, రహస్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సైతం గ్రాండ్ గా జరగడం గమనార్హం.

కిరణ్, రహస్య జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేయడంతో పాటు ఈ జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కిరణ్, రహస్య కలిసి నటించాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా వాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. హీరోయిన్ రహస్య బంధువులంతా కూర్గ్ లో ఉండటంతో ఇక్కడ పెళ్లి వేడుక జరిగిందని సమాచారం అందుతోంది. దాదాపుగా ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న కిరణ్ రహస్య పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.



రాజా వారు రాణి గారు ఒకటయ్యారు! అంగరంగ వైభవంగా.. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి!
Congratulations to #KiranAbbavaram and #RahasyaGorak on their wedding, celebrated with close family and friends. pic.twitter.com/XMol8J4QQq
— Filmy Focus (@FilmyFocus) August 23, 2024
‘ఇంద్ర’ సినిమా నుండి గూజ్ బంప్స్ తెప్పించే 29 డైలాగులు .!












