మాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన సంచలన రిపోర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ రిపోర్ట్ గురించి చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై బెంగాలీ నటి (Heroine) శ్రీలేఖ మిత్రా (Sreelekha Mitra) సంచలన ఆరోపణలు చేశారు. డైరెక్టర్ రంజిత్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు. పలేరి మాణిక్యం మూవీ అడిషన్స్ కోసం వెళ్లిన సమయంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె అన్నారు.
అడిషన్స్ లో భాగంగా డైరెక్టర్ ను కలిసి సినిమాటోగ్రాఫర్ తో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో దర్శకుడు నా చేతి గాజులను తాకడంతో ఇబ్బందిగా అనిపించిందని శ్రీలేఖ వెల్లడించారు. ఆ తర్వాత దర్శకుడు నా మెడపై చేయి వేశారని ఆమె చెప్పుకొచ్చారు. దర్శకుడు అలా ప్రవర్తించడంతో అక్కడ ఉండలేక వెంటనే రూమ్ నుంచి బయటకు వచ్చానని శ్రీలేఖ (Heroine) అన్నారు. ఆ సమయంలో ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేకపోయానని శ్రీలేఖ పేర్కొన్నారు.
ఆ రాత్రి మొత్తం హోటల్ రూమ్ లో నేను భయపడుతూ గడిపానని శ్రీలేఖ తెలిపారు. నా గది తలుపును ఎవరైనా కొడతారేమో అని భయాందోళనకు గురయ్యానని శ్రీలేఖ కామెంట్లు చేశారు. త్వరగా తెల్లవారితే బాగుంటుందని ఫీలయ్యానని ఈ ఘటన జరిగిన తర్వాత నాకు ఇంటికి వెళ్లడానికి రిటర్న్ టికెట్ కూడా ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మలయాళీ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని శ్రీలేఖ మిత్రా పేర్కొన్నారు.
రంజిత్ మాత్రం శ్రీలేఖ మిత్రా చేసిన ఆరోపణల్లో నిజం లేదని మూవీ ఆఫర్ ఇవ్వకపోవడం వల్లే ఆమె అలా కామెంట్ చేశారని తెలిపారు. శ్రీలేఖ ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది.