Nara Lokesh, Yash: నారా లోకేష్‌తో ‘కేజీఎఫ్’ స్టార్ యష్.. వైరల్ అవుతున్న పిక్స్..!

  • December 15, 2022 / 06:06 PM IST

సినిమాలకు, రాజకీయాలకు ఎప్పటినుండో అవినాభావ సంబంధం ఉంది.. ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణా నిధి, జయ లలిత వంటి వారు సినిమాల నుండి పాలిటిక్స్‌లోకి వెళ్లి సీఎంలుగా చరిత్ర సృష్టించారు.. టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీతో సహా పలువురు నటీనటులు, నిర్మాతలు రామారావు స్థాపించిన పార్టీలోనూ.. ఇతర పార్టీలలోనూ కొనసాగుతున్నారు.. ఇప్పుడు సినిమా – రాజకీయాల టాపిక్ ఎందుకు తెరమీదకొచ్చిందంటే.. నారా చంద్రబాబు నాయుడు తనయడు లోకేష్, ‘కేజీఎఫ్’ స్టార్, ‘రాకింగ్ స్టార్’ యష్ ఇద్దరూ భేటీ అయ్యారు..

యష్ – లోకేష్ కలిసి ఉన్న ఫోటోలు చూసి అంతా షాక్ అయ్యారు.. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలిసి ఉంటారు?.. కలిసి ఏం మాట్లాడుకుని ఉంటారు? అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. యష్ – లోకేష్ దాదాపు అరగంట పైనే మాట్లాడుకున్నారట.. పాన్ ఇండియా సెన్సేషన్ యష్, ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న లోకేష్ కలవడం గురించి.. వాళ్లిద్దరలో ఎవరో క్లారిటీ ఇవ్వడం కానీ..

ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ చెయ్యాలి.. లేదంటే రకరకాల వార్తలతో కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది అంటూ సినీ, రాజకీయ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం యష్ – లోకేష్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus