Jr NTR: 10 ఏళ్ళు పూర్తి కాకుండా ఆ టైటిల్ ను ఎలా వాడుకుంటారు..!

‘ఆర్ఆర్ఆర్’ సూపర్ సక్సెస్ తో ఫుల్ స్వింగ్లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాలను కూడా అనౌన్స్ చేసి అభిమానుల్ని ఖుషి చేశాడు. ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇక 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. టైటిల్స్ ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రం బయటకి వచ్చాయి. కొరటాల శివ చిత్రం పై ఎలా ఉన్నా.. అందరి దృష్టి ‘ఎన్టీఆర్ 31’ పైనే పడింది.

ఆ చిత్రానికి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రానికి ‘అసుర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2015 లో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన మూవీకి ఇదే టైటిల్ ఫిక్స్ చేశారు.కానీ ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘NTR31’కి ‘అసుర’ టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రోహిత్ కి కలిసిరాని ఈ టైటిల్ తారక్ కు కలిసొస్తుందా? అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఓ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కాకుండా ఆ చిత్రం టైటిల్ వేరే సినిమాకి పెట్టుకోవడం వీలు కాదు. ఇది ఎప్పటి నుండో ఉన్న నియమం. మరి దానిని బ్రేక్ చేసి ‘అసుర’ టైటిల్ ను ఎలా పెట్టుకుంటారు. కాబట్టి ఇది ఎక్కువ శాతం నిజమయ్యే అవకాశం లేదు.

ఎన్టీఆర్ కు సంబంధించిన న్యూస్ కాబట్టి రెండు, మూడు రోజులు చక్కర్లు కొడుతుంది అంతే..! ఇక ఎన్టీఆర్-కొరటాల కాంబో మూవీ వచ్చే నెల నుండీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ ను ఫినిష్ చేసుకుని వస్తాడు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus