‘సావిత్రి’ సినిమా ట్రైలర్ ఆదిరింది
- February 17, 2016 / 01:44 PM ISTByFilmy Focus
బాణం’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘అసుర’ చిత్రం వరకు విభిన్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ ‘సావిత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం చిత్రబృందం ‘సావిత్రి’ చిత్ర టీజర్ ని విడుదల చేసింది. నారా రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తుంది.
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సాదినేని పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాత వి.బి రాజేంద్రప్రసాద్. విడుదలైన ఈ టీజర్ లో రోహిత్ మరియు నందిత ఫన్నీ డైలాగులతో అదరగొట్టారు. మునుపటి చిత్రాల కన్నా ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక డిఫరెంట్ లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా కొత్తదనం కనిపిస్తుంది.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉంది.ఈ వేసవిలో మార్చ్ 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











