Naresh Agastya: ‘మత్తు వదలరా’ హీరోకి ఈసారైనా కలిసొస్తుందా..?

2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అందులో సింహాతో (Sri Simha Koduri) పాటు ఇంకో హీరో టైపు రోల్ చేసి ఫేమస్ అయ్యాడు నరేష్ అగస్త్య (Naresh Agastya). క్లైమాక్స్ వరకు అతనే హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. అతని మేకోవర్ కూడా బాగా సెట్ అయ్యింది. ఆ తర్వాత ‘కిస్మత్’ (Kismath) ‘మాయాలో’ వంటి సినిమాల్లో సోలో హీరోగా కూడా చేశాడు. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ‘హ్యాపీ బర్త్ డే’ (Happy Birthday) లో కూడా ముఖ్య పాత్ర పోషించాడు.

Naresh Agastya

ఇటీవల వచ్చిన ‘పరువు’ అనే వెబ్ సిరీస్ తో పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఇదిలా ఉండగా.. అతను హీరోగా.. ‘ప్రిన్స్’ (Prince Cecil) కీలక పాత్రలో తెరకెక్కిన ‘కలి’ (Kali) చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. టైటిల్ చూస్తుంటే.. ప్రభాస్ (Prabhas) ‘కల్కి..’ (Kalki 2898 AD) కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది… కనిపిస్తుంది..! డిజైన్ కూడా అలానే ఉంది. ‘ ‘కల్కి..’ క్రేజ్ ను వాడుకోవాలనుకుంటున్నారా?’ అని చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తే..

‘ఆ సినిమా కంటే ముందుగానే మా సినిమా టైటిల్ ను, డిజైన్ ను ఫైనల్ చేసినట్లు చెప్పుకొచ్చారు. సరే దాన్ని పక్కన పెడితే.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ..ల ‘బ్రో’ (BRO) సినిమా పోలికలు కనిపిస్తున్నాయి. ప్రిన్స్ రోల్ తాను నివసించే బంగ్లాలో ఎవరినో పాతి పెడుతున్నట్టు.. మరోపక్క అతని ఫ్యామిలీ లైఫ్ లో గొడవలు చూపిస్తున్నారు.

మరోపక్క అతని బంగ్లాకి … నరేష్ అగస్త్య వస్తున్నాడు. అతను టైంని అన్నట్టు చెబుతున్నాడు. ‘బ్రో’ పవన్ కళ్యాణ్ …లా..! ఇది సైకలాజికల్ థ్రిల్లరా? లేక ఫాంటసీ టచ్ ఉన్న సినిమానా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా అయినా నరేష్ అగస్త్యకి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

‘సత్యం సుందరం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus