ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్.. కెరీర్ ప్రారంభం నుండీ ఎక్కువగా కామెడీ సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. అలా అని తనలోని నటుడుని పక్కకు పెట్టేయ్యలేదు. ఛాన్స్ దొరికిన ప్రతీ సారి సీరియస్ రోల్స్ తో కూడా అలరిస్తూ వచ్చాడు. ‘నేను’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో అతను సీరియస్ రోల్స్ కూడా ప్లే చేసి ఆకట్టుకున్నాడు. అయితే కామెడీ హీరోగానే ఇతను స్టార్ డం ను సంపాదించుకున్నాడు.
గతంలో ఇతని సినిమాలు మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉండేవి. ఏడాదికి 8 సినిమాలు చేస్తే అందులో 6 హిట్లుండేవి..! సినిమా పై బ్రతికే ప్రతీ ఒక్కరికీ చేతినిండా పనుండేలా చేసాడు. అందుకే అల్లరి నరేష్ అంటే ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం ఏర్పడింది. అయితే జబర్దస్త్ వంటి కామెడీ షోల హవా పెరగడంతో.. కామెడీ కోసం జనాలు థియేటర్ల వరకూ రావడం తగ్గించారు. దాంతో అల్లరి నరేష్ సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతూ వచ్చాయి. 8 ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న అల్లరి నరేష్..
ఎట్టకేలకు ‘నాంది’ చిత్రంతో హిట్ కొట్టాడు. కానీ ఇది సీరియస్ మూవీ. అల్లరి నరేష్ నుండీ ఆశించే కామెడీ ఇందులో ఉండదు. ‘నాంది’ హిట్టైంది అని తెలిసినప్పటి నుండీ ఇండస్ట్రీలో చాలా మంది నరేష్ ను పేరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు నరేష్ సీరియస్ రోల్స్ మాత్రమే చెయ్యాలా.. లేక కామెడీ సినిమాలు చేసినా చూస్తారా అనే విషయం పై క్లారిటీ లేక అతను ఇబ్బంది పడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!