నాకు కడుపు రాలేదు మొర్రో అంటే నమ్మరేం…
- August 29, 2017 / 12:25 PM ISTByFilmy Focus
ఒక్కోసారి నిజమైన నిజం కంటే అర్ధం లేని అబద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. పాపం బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ విషయంలో ఆ అబద్ధమే అర్ధం లేని ఇబ్బందులని తెచ్చిపెట్టింది. అది కూడా పెళ్లి కాని అమ్మడికి కడుపోచ్చింది అనే వార్త ముంబై మీడియాలో సంచలనం సృష్టించింది. మొదట్లో ఇలాంటి వార్తలపై పెద్దగా స్పందించడం ఎందుకులే అని లైట్ తీసుకొన్న నర్గీస్ కు తనకు సన్నిహితులైనవారు కూడా “ఎన్నో నెల ?” అంటూ పర్సనల్ మెసేజస్ చేసేసరికి, ఇంక సైలెంట్ గా ఉండడం మంచిది కాదు అని భావించి “నేను గర్భవతిని కాదు” అంటూ తనదైన శైలిలో కాస్త వెటకారంగా స్పందించింది.
తనను ఒక పర్టీక్యులర్ డ్రెస్ లో చూసి జనాలు నాకు కడుపోచ్చింది అనుకొన్నారే కానీ.. అది నా “బేబీ బంప్” కాదు. ఒక బర్గర్ తినడం వల్ల వచ్చిన చిన్నపాటి బొజ్జ అంతే అంటూ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకొంది. పాపం.. బర్గర్ తినడం వల్ల నర్గీస్ కి ఎన్ని కష్టాలొచ్చాయో అంటూ జాలి చూపుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














